WNP: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షా కేంద్రాన్ని నేడు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షల్లో పేపర్-3, పేపర్-4 నిర్వహించగా పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు. గ్రూప్-2 పరీక్షకు 8,569 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 4,329 మంది హాజరయ్యారు.