శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి ఇరుదేశాల ఆర్థిక సంబంధాలకు మూల స్తంభాలుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. శ్రీలంకకు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని ద్వారా శ్రీలంకకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు.