చలికాలంలో బోన్ సూప్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్ బోన్స్‌ను బాగా ఉడికించి ఆ సూప్‌ను తాగుతుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎముకలు, మజ్జ, టెండాన్లు, చర్మం, లిగమెంట్లను ఎక్కువ సమయంపాటు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు బయటకు వస్తాయి. అలాంటి సూప్ తాగితే మనకు పోషకాలు లభిస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలకుండా చూస్తుంది.