పార్లమెంట్ ముందుకు రేపు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. లోక్‌సభలో కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదానికి మూడింట రెండోవంతు ఎంపీల మద్దతు అవసరం. మొత్తం 361 మంది ఎంపీలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే, ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం ఉత్కంఠగా మారింది.