KMM: తెలంగాణ గిరిజన సంఘం గార్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవోలకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. గార్ల మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న సందర్భంగా రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలకు కూడా సర్వే చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని జిల్లా కార్యదర్శి హరినాయక్ విజ్ఞప్తి చేశారు.