NGKL: జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షకేంద్రంలో సోమవారం బల్మూర్ మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి(25) నిండుగర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతూనే గ్రూప్-2 పరీక్ష దిగ్విజయంగా రాశారు. అనంతరం పరీక్ష ముగిసిన వెంటనే అధికారులు ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ వాహనంలో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షరాయాలనే ఆమె పట్టుదలను పలువురు ప్రశంసించారు.