AP: ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు సమస్యలుంటే అధికారులకు చెప్పాలని సూచించారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.