AP: కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు CRDA ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రూ.45,249 కోట్లకు CRDA ఆమోదం తెలిపిందని అన్నారు. మూడ్రోజుల్లో ఈ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తి అవుతాయని చెప్పారు. అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు. భవనం టవర్‌కు రూ.768 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.