NZB: చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బాన్సువాడ పట్టణ మాల సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, మన్నే చిన్న సాయిలు, నెర్రే నరసింహులు, గైని రవి, శివయ్య, భూమయ్య, గంగాధర్ తదితరులున్నారు.