‘మహాభారత’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అదొక భారీ ప్రాజెక్ట్. దీని విషయంలో నాపై ఎంతో బాధ్యత ఉంది. భారతీయులుగా ఇది మనకు ఎంతో చేరువైన కథ. దీనిని సరైన విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రతి భారతీయుడు గర్వించే విధంగా తెరకెక్కించాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.