ADB: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని కొమరం భీం ప్రాంగణంలో మహిళా సంఘాల ద్వారా పెరటి కోళ్ల పెంపక లబ్ధిదారులకు కోడి పిల్లలను, రక్షక బుట్టలను ఆమె పంపిణీ చేశారు.