NRPT: మరికల్ మండల కేంద్రంలోని శబరిమలకు కుసురు రవి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములకు సోమవారం గురుస్వామి అయ్యప్ప ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. మరికల్ నుంచి ఆరుసార్లు పాదయాత్ర చేస్తూ శబరిమలకు చేరడం అయ్యప్ప అనుగ్రహం వల్లే జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, సతీష్, భీమేష్ పాల్గొన్నారు.