నంద్యాల: జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు సోమవారం నందికొట్కూరులో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమంగా నాటుసారా అమ్ముతున్న షికారి జోహారా అనే వ్యక్తి నుంచి పది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామాంజనేయులు తెలిపారు. అక్రమ నాటు సార చట్టరీత్యా నేరమని విక్రదారులు నాటు సారా అమ్మకాలను మానుకోవాలన్నారు.