MBNR: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటులభించడంతో ప్రమాణస్వీకారం చేసేందుకు HYDకు బయలుదేరారు. మార్గమధ్యంలోని బాలానగర్ మండలం పెద్దాయిపల్లి చౌరస్తాలో OBC సెల్ మండల అధ్యక్షుడు పొట్లపల్లి యాదయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీహరిని శాలువాలతో సన్మానించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఎమ్మెల్యేకు ముందస్తు శుభాకాంక్షలు చెప్పారు.