BHPL: మల్హర్ మండలంలోని కొండంపేటలోని క్రీడా ప్రాంగణంలోకి వెళ్లే దారి ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ దారి పూర్తిగా ముళ్లతో కప్పబడి, క్రీడా ప్రాంగణంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు సమీపంలో ఉన్న ఈ ప్రాంగణం చిన్న వానకే చిత్తడిగా మారుతోందని, దారి ఈ విధంగా ఉంటే ఆడుకోవడం ఇలా అని వారు ప్రశ్నిస్తున్నారు.