విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. చోరీలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్ పురోగతిపై అధికారుల నుంచి మంత్రి వివరణ కోరారు. రాగితీగ కోసమే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను చోరి చేస్తున్నారని అధికారులు మంత్రికి వివరించారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా 90 శాతం చోరీ ముఠాలను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.