WNP: మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా ఆత్మకూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం కిడ్నీ రోగులు ఉన్నందున ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.