SKLM: మీకోసం కార్యక్రమంలో వచ్చే ప్రజా పిర్యాదులను చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో పరిష్కారానికి చర్యలు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి 62 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజా పిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.