నటి సోనాక్షి సిన్హా 2019లో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆమెకు అక్కడ రామాయణంపై ప్రశ్న ఎదురు కాగా.. సమాధానం చెప్పలేకపోయింది. దీనిపై తాజాగా శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అది నటి తప్పు కాదు.. ఆమె తండ్రి తప్పు’ అని వ్యాఖ్యానించారు. పురాణాల గురించి పిల్లలకు చెప్పకపోవడం తల్లీదండ్రుల తప్పు అని ఆయన అన్నారు.