MNCL: ఫ్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సోమవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం మాట్లాడుతూ.. కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు.