2022-23లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(CGRF)కు 295 ఫిర్యాదులు వచ్చినట్లు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(APERC) తెలిపింది. వీటిల్లో 266 సమస్యలను పరిష్కరించినట్లు చెప్పింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో APEPDCLకు రూ.33,500 జరిమానా విధించినట్లు వెల్లడించింది. అలాగే విద్యుత్ అంబుడ్స్‌మెన్‌కు వచ్చిన 29 ఫిర్యాదుల్లో 28 సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొంది.