కరోనా బాధితులకు అందజేసిన చెక్కుల్లో తన పేరు రాసుకోకుండా తెలివితక్కువగా ప్రవర్తించానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. 2020లో డొనాల్డ్ ట్రంప్ పేరుతో చెక్కులు జారీ అయ్యాయని.. దాంతో ఆయన ప్రజలకు సహాయం చేశారనే ఓ మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. తన ఆర్థిక విధానాలను సమర్థించుకుంటూ బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్రసంగించిన బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.