TG: రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, సీఎస్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు కూడా ఈ సమీక్షలో భాగమయ్యారు. పెండింగ్లో ఉన్న రహదారుల నిర్మాణం, అలాగే రీజనల్ రింగ్ రోడ్ (RRR)పై చర్చించారు.