AP: వినుకొండలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా చేపట్టిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పరిశీలించారు. 561 స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల చెక్కును అందించారు. అనంతరం మొక్కజొన్న వేస్ట్‌తో తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు.