AP: ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గొంతునొప్పితో బాధపడుతున్న భార్య సత్యదీపికను 5 రోజులక్రితం కిషోర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ తెల్లవారుజామున దీపిక మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, ఆమె మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరపాలని విజయవాడ పటమట పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు.