AP: తమ కుటుంబ ఆస్తుల విషయంలో విజయమ్మ రాసిన లేఖలోని అంశాలు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని PCC అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రతి చిన్న విషయానికి వైసీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆస్తుల విషయంలో కూడా తాము పదేపదే నిజాలు చెబుతుంటే కొందరు వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.