బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో NDA కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్-RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమి 50 కంటే తక్కువ స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. దీంతో ‘రాహుల్ గాంధీ ఎక్కడ?’, ‘ఓట్ చోరీపై పోరాటం చేసే రాహుల్ ఎక్కడ?’ అంటూ కాంగ్రెస్ అగ్రనేతపై సోషల్ మీడియాలో మీట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.