AP: తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై ఆరోగ్య శాఖ స్పందించింది. బలభద్రపురంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నాయని వెల్లడించారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కర్నూలులో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.