AP: విశాఖ డేటా సెంటర్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు జగన్ పునాది వేశారని తెలిపారు. డేటా సెంటర్లో లక్షల ఉద్యోగాలని ప్రచారం చేస్తున్నారని.. ఒప్పందంలో కేవలం 200 ఉద్యోగాలే ఉన్నాయని వెల్లడించారు. ఉద్యోగాల కల్పనపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. నీరు, విద్యుత్, మౌలిక వసతులపై స్పష్టత లేదన్నారు.