ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో ఆస్కార్స్ 2025 కోసం ‘లాపతా లేడీస్’ షార్ట్‌లిస్ట్ కావడంలో విఫలమైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) బుధవారం ఆస్కార్ 2025 కోసం పోటీలో ఉన్న చిత్రాల (10 కేటగిరీలు) షార్ట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో ‘లాపతా లేడీస్’కు చోటు దక్కలేదు.