కొందరు ప్రతీ కూరలోనూ కరివేపాకు ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే కరివేపాకు కేశాల సంరక్షణకు సహకరిస్తుంది. కరివేపాకు నూనెతో వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే ఈ ఆకుని నేరుగా తింటే కురులు బలంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులోని విటమిన్లు ఎ, బి, సి, డి, కాల్షియం, ఐరన్ శరీరాన్ని రిపేర్ చేస్తాయి. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెరుగుతాయి. ఆకును పొడి చేసుకుని తిన్నా ఫలితం ఉంటుంది.