సిరియాలో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తిరుగుబాటుదారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ అల్ బషీర్‌ను ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. బషీర్ వచ్చే ఏడాది వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బషీర్ ప్రకటన అనంతరం సివిల్ సర్వెంట్లు, ఆరోగ్య కార్యకర్తలు యథావిధిగా విధుల్లోకి రావాలని రెబల్స్ పిలుపునిచ్చారు.