AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి ఈడీ షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. విశాఖ హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఉన్నట్లు తెలిపింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు పేర్కొంది. అలాగే, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.