TG: వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కొట్టుకుపోయిన కల్వర్టులు, నీట మునిగిన వేల ఎకరాల వరి పొలాలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌ను సందర్శించాలని సీఎంను కోరినట్లు మంత్రి తెలిపారు.