TG: ములుగు జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి వల్ల వాహనాల రద్దీ పెరిగిందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కుటుంబాల సంతోషాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.