AP: ముగ్గురు పిల్లలను కనాలంటూ సీఎం చంద్రబాబు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం అర్థరహిత నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. విద్య, వైద్యం, నివాసం, పోషణ వంటి ప్రాథమిక అవసరాల ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు రూ.25 వేల నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.