ATP: ఉరవకొండలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మొదటి సంతకం వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి చేశారు. పీపీపీ విధానాన్ని విరమించి ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలతో చంద్రబాబు కళ్లు తెరిపిద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు.