TG: లగచర్ల ఘటనలపై నమోదైన కేసుల విచారణ నాంపల్లిలో ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యాయి. వికారాబాద్ కోర్టు నుంచి కేసులను నాంపల్లి కోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఆస్తులపై దాడుల కేసులను ప్రత్యేక న్యాయస్థానంలోనే విచారించాలని గతంలోనే హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కేసుల బదిలీ జరిగింది. మరోవైపు ఈ కేసులో అరెస్టైన రైతులు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.