TG: ప్రకృతిని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం జీవరాశి మనుగడకు అత్యంత ఆవశ్యకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి HYDను కర్బన ఉద్గార రహిత నగరంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో మూడు జోన్ల వారీగా ‘గ్రీన్ స్ట్రాటజీ’ని అమలు చేస్తున్నామన్నారు.