త్వరలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 18న భారత తరఫున చర్చల కోసం ఆయన డ్రాగన్ దేశానికి వెళ్తున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ పర్యటనలో ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల నివారణ, పెట్రోలింగ్, బఫర్ జోన్లకు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ అంశాలపై చర్చించేందుకు చైనా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యూ ప్రాతినిధ్యం వహించనున్నారు.