TG: మాయని గాయం.. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్లు. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ బీభత్సంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. NIA కోర్టు దోషులకు మరణశిక్ష ఖరారు చేసినా, అది ఇంకా అమలుకు నోచుకోలేదు. తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధితులు నేటికీ ఆవేదన చెందుతున్నారు ఉగ్రవాదుల శిక్షల అమలులో జాప్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.