TG: కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తేల్చి చెప్పారు. అవినీతి పరులను తాము తీసుకోమని స్పష్టం చేశారు. కవిత ఎపిసోడ్లో బీజేపీ పాత్ర లేదన్నారు. ఆమె మాటలతో అవినీతి జరిగిందని తేటతెల్లమైందని అన్నారు. 20 నెలల క్రితమే కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వాల్సిందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిని కాంగ్రెస్సే కాపాడుతోందని పేర్కొన్నారు.