»Will Muslim Population Be Growing If Their Lives Were Made Difficult Sitharaman Counters Wests Perception
Nirmala Sitharaman: పాకిస్తాన్ కంటే భారత్ ముస్లీంల జీవనం భేష్.. భారత్ వచ్చి చూడాలని సవాల్
పాకిస్తాన్ లోని వారి కంటే భారత్ ముస్లీంల జీవన విధానం బాగుందని, అలాగే అక్కడ మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని, కానీ భారత్ లో అలా కాదని నిర్మలా సీతారామన్ అన్నారు.
భారత్ విషయంలో వెస్టర్న్ దేశాల్లో (Western perceptions) జరుగుతున్న అబద్దపు ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ఘాటుగా స్పందించారు. భారత్ లో ముస్లీం మైనార్టీల పైన (Minorities in India) హింస జరుగుతోందని పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలను ఆమె దుయ్యబట్టారు (negative Western perceptions). ఈ సందర్భంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లీం జనాభా ఉన్న రెండో దేశం భారత్ అని గుర్తు చేశారు. ఇస్లాం దేశమైన పాకిస్తాన్ లోని ముస్లీంల కంటే భారత్ లోని ముస్లీం ప్రజల జీవనం మెరుగ్గా ఉందని వెల్లడించారు. అదే సమయంలో పాక్ లో మైనార్టీల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోందన్నారు. ఉన్న వారి జీవన పరిస్థితి కూడా దిగజారుతోందన్నారు. కానీ భారత్ లో అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. నిర్మలమ్మ అమెరికా పర్యటనలో ఉన్నారు. వాషింగ్టన్ లో పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ ల (US think tank Peterson Institute for International Economics-PIIE) జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో ముస్లీం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి అంశాలపై ప్రశ్నించారు. దీనికి నిర్మలమ్మ గట్టి జవాబిచ్చారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లీం జనాభా ఉన్న దేశం భారత్ అని, వారి సంఖ్య కూడా తమ దేశంలో పెరుగుతోందని చెప్పారు. అలాగే, పాకిస్తాన్ వారి కంటే మా దేశంలో ముస్లీంల జీవనం మెరుగ్గా ఉందన్నారు. ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉంటే 1947 నుండి ఇంత జనాభా పెరుగుతుందా అని ప్రశ్నించారు. అదే సమయంలో పాకిస్తాన్ వంటి దేశాల్లో మైనార్టీల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతోందన్నారు. కానీ మా దేశంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. తమ వద్ద శాంతి భద్రతలు అనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశం అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఓ దేశాన్ని నిందించడం విడ్డూరం అన్నారు. ఇష్టారీతిన రాతలు రాసే వారు భారత్ రావాలని సూచించారు. దేశమంతా ఒంటరిగా తిరిగి తమ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఎవరో చెప్పింది వినవద్దని, భారత్ కు వచ్చి… ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చునని చెప్పారు.
పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుందని, మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు కానీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. అంతేగాక ముస్లీంలోని కొన్ని తెగలు సైతం క్షీణిస్తున్నాయని గుర్తు చేశారు. అక్కడ మైనార్టీలపై చిన్న చిన్న ఆరోపణలకే తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని, వ్యక్తిగత కోపాలను తీర్చుకోవడానికి కఠిన శిక్షణలు, మరణ శిక్షలు అమలు చేస్తున్నారన్నారు. విచారణ లేకుండానే అనేకమంది బాధితులను వెంటనే దోులుగా మార్చుతున్నారన్నారు.