»Waheeda Rehman Dadasaheb Phalke Award For Senior Bollywood Actress
Waheeda Rehman: బాలీవుడ్ సీనియర్ నటికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌ను వరించింది. వహీదా చేసిన తొలి చిత్రం తెలుగు మూవీ కావడం విశేషం. రోజులు మారాయి అనే మూవీతో అరంగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో ఆమెకు అనేక అవార్డులు లభించాయి.
బాలీవుడ్ (Bollywood) సీనియర్ నటి వహీదా రెహమాన్ (Waheeda Rehman)కు దేశంలోని ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (Dadasaheb Phalke Award) లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈమేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. గత ఏడాది ఈ అవార్డు ఆషా పరేఖ్‌కు లభించిన సంగతి తెలిసిందే. వహిదా రెహమాన్ భారతీయ సినిమాకు అద్భుతమైన సేవలు అందించారు.
సినిమా రంగంలో ఆమె చేసిన సేవకు గాను ఈ అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Minister Anurag Takur) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వహీదా రెహమాన్ హిందీ సినిమా (Hindi Movies)ల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. తన పాత్రలతో ఆమె విమర్శకుల వద్ద ప్రశంసలు అందుకున్నారు. ఆమె చేసిన సినిమాల్లో ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదావీ కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మొదటి సినిమా తెలుగులోనే:
సినీ ఇండస్ట్రీలో వహిదా (Waheeda Rehman) ఐదు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌ను కొనసాగించింది. 1955లో ‘రోజులు మారాయి’ (Rojulu marayi) అనే తెలుగు సినిమా (Telugu Movie) ద్వారా ఆమె తన నటన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మారారు. అక్కడ నటిగా గుర్తింపు పొందారు. రేష్మ ఔర్ షేరా అనే సినిమాలో ఆమె నటనకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది.
పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అవార్డులు కూడా వహీదా రెహమాన్‌కు దక్కాయి. నటనలో ఆమె చేసిన కృష్టి కెరీర్లో అత్యున్నత స్థాయికి చేర్చింది. నటనలో సేవలందించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న భారతీయ వనిత వహీదాకు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Minister Anurag Takur) తెలిపారు.