»The Largest Hindu Temple In America Set Up In 183 Acres
Largest Hindu Temple: అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయం..183 ఎకరాల్లో ఏర్పాటు
అతి పెద్ద హిందూ ఆలయం అమెరికాలో నిర్మించారు. సుమారు 183 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో మొత్తం 10 వేలకు పైగా విగ్రహాలను నిర్మించినట్లు నిర్మాణకర్తలు వెల్లడించారు.
అమెరికా (America)లో అతిపెద్ద హిందూ దేవాలయం (Hindu Temple) ఏర్పాటైంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లేలో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలుస్తుండటం విశేషం. 19వ శతాబ్దంలో ఆనాటి ఆధ్యాత్మిక గురువు అయిన భగవాన్ స్వామి నారాయణ్‌కు ఈ అద్వితీయమైన ఆలయాన్ని అంకితమిచ్చినట్లుగా ఆలయ నిర్మాణకర్తలు వెల్లడించారు.
ఈ ఆలయాన్ని మొత్తం 183 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. వేల ఏళ్ల క్రితమే శిథిలమైన ఆలయం స్థానంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ధర్మకర్తలు వెల్లడించారు. ఈ భారీ ఆలయ నిర్మాణం కోసం దాదాపుగా 12500 మంది వరకూ విరాళాలు ఇచ్చారు. ఇందులో అన్ని రకాల దేవుళ్లను ప్రతిష్టించినట్లు అక్షర్ధామ్ కమిటీ సభ్యులు తెలిపారు.
అక్టోబర్ 8వ తేదిన ఈ అతి పెద్ద ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయం మొత్తం 10 వేలకు పైగా విగ్రహాలు ఉంటాయని, దేశంలోని ఇతర అక్షర్ధామ్ ఆలయాల మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసినట్లుగా నిర్మాణకర్తలు వెల్లడించారు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 12 ఏళ్ల సమయం పట్టిందని, 10 వేల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు నిర్మాణకర్తలు తెలిపారు.
ఆలయంలో భారతీయ సంగీత పరికరాలు, నృత్య పరికరాలకు సంబంధించిన శిల్పాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ ఆలయాన్ని అక్టోబర్ 8వ తేదిన అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నట్లు నిర్మాణకర్తలు తెలిపారు. అమెరికాలో అతి పెద్ద హిందూ ఆలయం ఇదేనని, ఈ ఆలయం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.