ఇన్ఫోసిస్ (Infosys) సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, సుధామూర్తి (Sudhamurthy) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుధామూర్తి పేరును ఓ మహిళ దుర్వినియోగపరిచిందని. అమెరికా(America)లో జరిగే ఓ కార్యక్రమానికి ఆమె హాజరవుతారంటూ ప్రచారం చేసింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వారి నుంచి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది. ఇక సుధామూర్తి ఫిర్యాదుతో పోలీసులు (Police) రంగంలోకి దిగారు. ఆమె పేరు చెప్పి మోసాలకు దిగిన మహిళలు ఇండియా (India) లో ఉన్నారా? లేక అమెరికాలో ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా (KKNC) వారు గతంలో సుధామూర్తిని ఆహ్వానించారు. తీరిక లేకుండా ఉన్న కారణంగా తాను రాలేనని ఆమె చెప్పారు. కానీ, ఆ కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్టు జరుగుతున్న ప్రచారం గురించి సుధామూర్తి దృష్టికి వచ్చింది. అయితే, లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి తమను మోసం చేసినట్టు కేకేఎన్సీ వారు పేర్కొన్నారు. శ్రుతి (Shruti) అనే మహళ కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. సెప్టెంబర్ 26న ‘డాక్టర్ సుధా మూర్తితో మీట్-అండ్-గ్రీట్’ (meet-and-greet’)అనే కార్యక్రమం నిర్వహిస్తు్న్నట్లు ప్రకటనలు చేశారు. ఇది సుధా మూర్తి కంటపడటంతో ఇక వీరిపై ఫిర్యాదు