Minister Jagadish Reddy Went Door To Door On Scooty Distributes Cheques
Minister Jagadish Reddy: మంత్రి అంటే మినిమం ఉంటుంది. కారు, వెనకాల వాహనాలు.. ముందు పోలీస్ వాహనం తప్పనిసరి. మంత్రి జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy) మాత్రం అందుకు విరుద్దం.. ఇటీవల ఆటోలో వెళ్లి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ఆ వెంటనే దానిపై చర్చ జరిగింది. తర్వాత మరోసారి వార్తల్లోకి వచ్చారు.
సూర్యపేటలో మంత్రి జగదీశ్ అభిమాని నరేష్ స్కూటీ కొనుగోలు చేశారు. ఓ సారి నడపాలని కోరగా.. డ్రైవ్ చేశాడు. కాసేపు నడిపి వదిలి వేయలేదు. స్కూటీపై పట్టణం మొత్తం తిరిగారు. అవును షెడ్యూల్ ప్రకారం కల్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించి లబ్దిదారులకు చెక్కులను ఇవ్వాలి. సో.. ఆ స్కూటీపై వెళ్లి చెక్కులను అందజేశారు.
మంత్రి చెక్కుల పంపిణీ గురించి తెలుసు.. సో అంతా మంత్రి కాన్వాయ్ కోసం చూస్తున్నారు. ఇంతలో మంత్రి స్కూటీ మీద రాగా.. ఆశ్చర్యపోయారు. లబ్దిదారుల ఇంటికి వచ్చి మరీ చెక్కులు ఇవ్వడంతో షాక్‌నకు గురయ్యారు. ఇది మంత్రి జగదీశ్ సింప్లిసిటీ అని డిస్కష్ చేశారు. అవును.. నిజమే, లబ్దిదారుల ఇంటికి వెళ్లి కలువడం గ్రేట్. అందుకోసం కారులో కాకుండా.. కాన్వాయ్‌తో వెళ్లకుండా.. టూ వీలర్ మీద వెళ్లడంతో చర్చకొచ్చింది.
ఎన్నికలకు దగ్గరకు వస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ప్రభుత్వ పథకం, చెక్కుల పంపిణీతో ముందుకెళ్లి.. తమను గుర్తుంచుకోవాలని ఇప్పటినుంచే అడుగుతున్నారు.