బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారారు. రైతులు ఆత్మహత్య చేసుకోవాలని మాట్లాడి.. నాలిక కరుచుకున్నారు. రైతులు ఆకలితో, ఆత్మహత్య చేసుకుని చావకూడదని చెప్పాల్సింది పోయి.. రైతులు ఆత్మహత్య చేసుకోవాలని కామెంట్ చేశారు.
Mla Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah) నోరు జారారు. ఓ సభ వేదికపై నుంచి రైతుల గురించి తప్పుగా మాట్లాడారు. లైంగిక వేధింపుల అంశాన్ని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ మరోసారి టికెట్‌ను కన్ఫామ్ చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు రైతులపై నోరు జారి.. మరోసారి వార్తల్లోకి వచ్చారు.
బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శంకుస్థాపన చేశారు. తర్వాత అక్కడ సభలో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావొద్దు.. ఆత్మహత్య చేసుకోవాలని అనేశారు. రైతులు ఆకలితో, ఆత్మహత్యలు చేసుకుని చావకూడదని చెప్పబోయి.. నోరు జారారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని దుర్గం చిన్నయ్య అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పబోయి.. చేసుకుని చావాలి అని కామెంట్స్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు కామెంట్స్ చేశారు. మాట్లాడేప్పుడు చూసి మాట్లాడాలని కోరారు. ఏం మాట్లాడుతున్నామో ప్రిపేర్ అయితే బాగుంటుందని, ఇలాంటి తప్పులు దొర్లవని చెబుతున్నారు.
జనాలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా తప్పులు మాట్లాడుతున్నారు. ఏదో చిన్నగా ఒక మాట అంటే ఫర్లేదు..చిన్నయ్య అయితే ఆత్మహత్య చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే అతనిని లైంగిక వేధింపుల అంశం నీడలా వెంటాడుతోంది. ఇప్పుడు రైతుల అంశం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలు వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాకాశాలను దెబ్బ తీసే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ వర్గం ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.