తెలుగు బిగ్‌బాస్ 7 (Bigg Boss 7) హౌస్ నుంచి మూడో వారం సింగర్ దామిని భట్ల (Damini Bhatla) ఎలిమినేట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉండగా అందులో దామినికి తక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అయితే షో ప్రారంభమైనప్పుడు తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలని తీసుకొచ్చిన బిగ్‌బాస్.. ఎలిమినేషన్ (Elimination) మాత్రం లేడీస్‌ని చేస్తున్నాడు. వచ్చే వారం కూడా ఇదే కొనసాగితే మాత్రం హౌసులో జెండర్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశముంది. అలానే గతంలో ప్రతి సీజన్లోనూ సింగర్స్ వచ్చారు. వాళ్లలో రాహుల్ విజేతగా నిలవగా, గీతా మాధురి (Geeta Madhuri) లాంటి వాళ్లు టాప్-5 వరకు వెళ్లారు. కానీ దామిని మాత్రం మూడో వారానికే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా హీరోయిన్ కిరణ్ రాథోడ్ (Kiran Rathore) ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు
బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ వారం ప్రియాంక జైన్, శుభశ్రీ (Subhashri), రతికా రోజ్, దామిని, ప్రిన్స్ యావర్, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు నామినేషన్స్ ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు. ఈ సందర్భంగా ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ‘ఏది పేలిపోతే వారు ఎలిమినేట్ అయినట్లు’ అని నాగార్జున (Nagarjuna) ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్ పేలిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్, సందీప్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇదంతా గేమ్ అమ్మా.. ఎమోషన్ అవ్వొద్దు’ అని శివాజీ హితవు పలికాడు. అంతకు ముందు ‘స్కంద’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ హీరో రామ్ పోతినేని (Hero Ram Potineni) బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో డ్యాన్స్ వేయించారు.