»Disease X Is Another Pandemic Coming This Time Targeting 5 Crore People
Disease X మరో మహమ్మారి రాబోతుంది… ఈ సారి 5 కోట్ల మంది టార్గెట్
మానవాళికి కోవిడ్19 చేసిన గాయాలు ఇంకా మాన లేదు. మరో డిసీజ్ దండయాత్ర చేయడానికి సిద్దం అయిందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహామ్మారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది.
Disease X is another pandemic coming... this time targeting 5 crore people
Disease X : కొవిడ్ మహమ్మారి (Covid Pandamic) పేరు చెబితేనే మానవాళి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడిప్పుడే దానిని మెల్లిగా మరచిపోతున్నారు జనం. మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొవిడ్-19 మొదటి దశ అని.. భవిష్యత్లో మరిన్ని మహమ్మారులు పుట్టుకొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. డైలీ మెయిల్ ఓ కథనం భయకంపితులను చేస్తోంది. తదుపరి మహమ్మారి తక్కువలో తక్కువ 5 కోట్ల మంది ప్రాణాలను తీసుకునే అవకాశం ఉందని యూకే వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్కు అధ్యక్షత వహిస్తున్న డేమ్ కేట్ బింగ్హామ్ చెబుతున్నారు. ఇప్పుడు రాబోయే మహమ్మారితో పోలిస్తే కొవిడ్-19 మరీ అంత ప్రాణాంతకం కాదని పేర్కొంది.
కొవిడ్-19 తర్వాత రాబోయే మహమ్మారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘డిసీజ్ X’ అని పేరుపెట్టింది. ఇది ఇప్పటికే దాని ప్రభావం చూపించడం మొదలు పెట్టొచ్చని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. 2019లో వచ్చిన కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ కంటే డిసీజ్ X ఏడు రెట్లు అధికంగా ప్రభావం చూపుతుందని డామ్ కేట్ బింగ్హామ్ పేర్కొన్నారు. తదుపరి మహమ్మారి ఇప్పటికే ఉన్న వైరస్ నుంచి ఉద్భవించి ఉండొచ్చని తెలిపారు. ఇప్పటికే ఉన్న అనేక వైరస్లలో ఒకదాని నుంచి పుట్టుకొచ్చే వైరస్ వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవించొచ్చని డామ్ కేట్ బింగ్హామ్ వివరించారు. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల వంటి అంశాలు భవిష్యత్తులో మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశాలను పెంచుతాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ యూకేహెచ్ఎస్ఏ (UKHSA) అధిపతి ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారీస్ వివరించారు. మహమ్మరులను నివారించాలంటే ఇప్పటినుంచే ప్లాన్ చేయాలని.. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు.